గాలి” మూవీ టీజర్ & సాంగ్ విడుదల

 

గాలి” మూవీ టీజర్ & సాంగ్ విడుదల



సంధ్య ఫిలిం బ్యానర్ పై రామ్ ప్రసాద్ గురజాడ, అంజలి, శ్రీకాంత్ పెరుమండ్ల, చిన్ని, రోజా రాణి, బి వి సుబ్బా రెడ్డి నటీ నటులుగా నాటకారంగంలో వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ గ్రహీత మరియు నంది, గరుడ వంటి అవార్డులు పొందిన టి రాము దర్శకత్వంలో నిర్మాత చందా లక్ష్మీ నారాయణ నిర్మించిన సోషియో ఫాంటసీ చిత్రం “గాలి”. ఈ చిత్ర టీజర్, సాంగ్ కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన నిర్మాత సాయి వెంకట్, ఆల్ రౌండర్ స్టార్ బల్లెం వేణు మాధవ్, రచయిత తిరునగిరి శ్రీనివాస్, ప్రముఖ విద్యా వేత్త దరిపల్లి నవీన్ కుమార్, తదితరులు పాల్గొని మోడి జన్మదిన సందర్బంగా చిత్ర ఆడియో, టీజర్ ను విడుదల చేశారు అనంతరం.

చిత్ర నిర్మాత లక్ష్మి నారాయణ మాట్లాడుతూ.. నాకు సినిమా ఫీల్డ్ కొత్త,అయినా రాము గారు రాసుకున్న సోషియో ఫాంటసీ కథ నచ్చడంతో ఈ సినిమా చేయడం జరిగింది. ఈ సినిమా కూడా మేము అనుకున్న దానికంటే బాగా వచ్చింది.మేము విడుదల చేసిన చిత్ర పోస్టర్స్ కు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తామని అన్నారు.

చిత్ర దర్శకుడు రాము మాట్లాడుతూ : కలి పురుషుడు కి అమ్మ వారికి మద్య జరిగే భీకర పోరాటమే ఈ “గాలి” చిత్రం. సస్పెన్స్ తో సాగే ఈ చిత్రం మన ప్రధాని నరేంద్ర మోడి జన్మదినాన టీజర్ & సాంగ్ లాంచ్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని అటల్ బిహారీ వాజ్ పాయ్ జన్మదిన శుభాకాంక్షలతో డిసెంబర్ 25 న విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అన్నారు.

లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ..దేవతా మూర్తి పాత్రలో నటించిన రోజా రాణి కలను నెరవేర్చడానికి వారి భర్త లక్ష్మి నారాయణ నిర్మాతగా మారి సినిమా చేయడం జరిగింది. సినిమా తీయడం అంటే అంత ఈజీ గాదు. ఇండస్ట్రీ లో వందల సినిమాలు షూటింగ్ చేసినా రిలీజ్ అయ్యేవి కొన్ని మాత్రమే.. అది పౌరాణిక సినిమాలు చేయడం అంటే మరీ కష్టం.అలాంటిది “గాలి” పేరుతో వస్తున్న ఈ సోషియో ఫాంటసీ సినిమా దర్శక, నిర్మాతలకు గొప్ప విజయం సాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

నటి రోజా రాణి మాట్లాడుతూ : అమ్మ వారికి కలిపురుషునికి మధ్య జరిగే బీకర యుద్ధ కథతో వస్తున్న ఈ సినిమాలో అమ్మ వారు పాత్రలో నటిస్తున్నాను . ఇలాంటి కఠిన మైన పాత్ర కు నన్ను ఎంచుకున్న దర్శక నిర్మాతల అంచాలకు ఏ మాత్రం తగ్గకుండా నటించానని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి చిత్రం లో నటించే అవకాశం రావడం నా అదృష్టం అన్నారు..

ఎడిటర్ వేణు మాట్లాడుతూ..గత 30 సంవత్సరాలనుండి ఎడిటింగ్ ఫీల్డ్ లో ఉన్నాను.ఇప్పుడు గాలి వంటి సోషియో ఫాంటసీ సినిమాకు ఎడిటింగ్ చేస్తున్నందుకు చాలా సంతోషం ఉంది..

రచయిత బల్లెం వేణుమాధవ్ మాట్లాడుతూ.. నా చేతుల మీదుగా సాంగ్ లాంచ్ చేయడం సంతోషంగా ఉంది. దర్శకుడు కృషికి అభినందనలు తెలియజేస్తున్నాను.

ప్రముఖ నటుడు జె. శ్రీనివాస్ మాట్లాడుతూ..బలగం సినిమా ప్రతి ఊరిలో ఎలా చూశారో.. ఇప్పుడు వస్తున్న ఈ గాలి కూడా బలగం అంత పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

బి. జె. పి లీడర్ బి. వి. సుబ్బారెడ్డి మాట్లాడుతూ..మోడి గారి జన్మదినం సందర్బంగా తీజర్, ట్రైలర్ విడుదల చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. రాము గారు ఎంత గొప్ప వ్యక్తి అంటే ఎటువంటి పేపర్ లేకుండా విలన్, హీరో ఇలా అందరి డైలాగ్స్ ఈజీ గా చెప్పగలరు. అద్భుతమైన క్యారెక్టర్ లో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు అన్నారు..

చిత్ర హీరోలు రామ్ ప్రసాద్ గురజాడ,శ్రీకాంత్ పెరుమండ్ల మాట్లాడుతూ.. ఇలాంటి సోషియో ఫాంటసీ చిత్రం లో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు మా కృతజ్ఞతలు అన్నారు.

హీరోయిన్స్ అంజలి, చిన్ని లు మాట్లాడుతూ.. ఆడవారికి దేవతల సినిమాలు అంటే ఎంతో ఇష్టం. అలంటి మాకు దైవ కథాంశం లో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు మా కృతజ్ఞతలు అన్నారు.

ప్రముఖ విద్యావేత్త నవీన్ కుమార్ మాట్లాడుతూ..నాకు కలలు అన్నా ,కళారంగం అన్నా చాలా అభిమానం.మా కాలేజ్ లో షూటింగ్ చేస్తాం అంటే మేము సంతోషంగా ఆహ్వానించాం.ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే షోషియో ఫాంటసీ చిత్రంలా అనిపిస్తుంది. మంచి కంటెంట్ తో వస్తున్న గాలి సినిమా కమర్షియల్ గా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

నటి నటులు :
మొదటి హీరో రామ్ ప్రసాద్ గురజాడ, హీరోయిన్ అంజలి, రెండవ హీరోగా శ్రీకాంత్ పెరుమండ్ల హీరోయిన్ చిన్ని, అమ్మవారిగా రోజా రాణి, కలి పురుషుడుgaa బి వి సుబ్బా రెడ్డి, పోచమ్మగా సుందరమ్మ, సురభి శేష కుమారి,సురభి వీణ, వంగ మోహన్ రెడ్డి, సాయి భవిష్య రెడ్డి, హేమలత రెడ్డి, రేవు సీతారాం, శిరీష్ బాబు, రజిత, రామ శర్మ,మాధవి,పావని, ఐలయ్య,శివ తదితరులు

సాంకేతిక నిపుణలు-
కథ స్క్రీన్ ప్లే మాటలు- దర్శకత్వం : టి రాము,
నిర్మాత : చందా లక్ష్మీ నారాయణ,
సంగీతం : అనిల్ కుమార్,
కెమెరా : కార్నె ప్రకాష్,
మేకప్ మ్యాన్ : టి సురేష్,
కాస్ట్యూమ్ డిజైనర్ : టి సంధ్య,
ఎడిటింగ్ : వేణు చౌదరి,
పి. ఆర్. ఓ : టి. యస్. యన్. మూర్తి

Comments

Popular posts from this blog

బ్యూటిఫుల్ విజువల్స్, మంచి మ్యూజిక్, ఎంటర్ టైన్ మెంట్ తో “K-ర్యాంప్” అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది – ప్రొడ్యూసర్స్ రాజేశ్ దండ, శివ బొమ్మకు

విజయ్ దేవరకొండ కొత్త సినిమా ప్రారంభo