Posts

Showing posts from October, 2025

“స్కై” సినిమా నుంచి ‘పోయేకాలం నీకు’ లిరికల్ సాంగ్ రిలీజ్

Image
  “స్కై” సినిమా నుంచి ‘పోయేకాలం నీకు’ లిరికల్ సాంగ్ రిలీజ్ మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో వేలార్ ఎంటర్ టైన్ మెంట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగిరెడ్డి గుంటక, శ్రీలక్ష్మి గుంటక, మురళీ కృష్ణంరాజు, పృధ్వీ పెరిచర్ల నిర్మిస్తున్న సినిమా “స్కై”. పృధ్వీ పెరిచర్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంతో శివ ప్రసాద్ అనే కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న “స్కై” సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘పోయేకాలం నీకు..’ అనే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ పాటకు పృథ్వీ పెరిచెర్ల లిరిక్స్ రాయగా, యదు కృష్ణన్ మరియు వల్లవన్ పాడారు. శివప్రసాద్ క్యాచీ ట్యూన్ తో కంపోజ్ చేశారు. ‘పోయేకాలం నీకు..’ పాట ఎలా ఉందో చూస్తే – ‘పోయేకాలం నీకు ముందుందని చెబుతుంటే, సచ్చిపోతున్నారు విననే వినను అంటుంటే, రాంగే రైటై పోదని చెబుతూ నేను ఉంటున్నా, రైటే రైటంటు వేగంగా నువ్వు పోతున్నావ్, నీకోసం పోరి వస్తుంటే పో పో పోమ్మని తరిమేశావ్, చాల్లే నీకు నా గొడవే, ఎందుకు లే నన్ను వదిలేసెయ్..’ అంటూ సాగుతుందీ పాట. “స్కై” ...

మోగ్లీ ‘సయ్యారే’ పాట చాలా బాగుంది : ఎంఎం కీరవాణి

Image
  మోగ్లీ ‘సయ్యారే’ పాట చాలా బాగుంది : ఎంఎం కీరవాణి రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్, సందీప్ రాజ్, టిజి విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మోగ్లీ 2025 ఫస్ట్ సింగిల్ సయ్యారే రిలీజ్ బబుల్గమ్ తో సక్సెస్ ఫుల్ డెబ్యు చేసిన యంగ్ హీరో రోషన్ కనకాల తన సెకండ్ మూవీ ‘మోగ్లీ 2025’ తో వస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత, కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన మోగ్లీ 2025 అడవి నేపథ్యంలో యూనిక్ రొమాంటిక్ యాక్షన్ డ్రామా. ఈ సినిమా గ్లింప్స్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. మేకర్స్ ఫస్ట్ సింగిల్ సయ్యారేను విడుదల చేసి మ్యూజిక్ జర్నీ ప్రారంభించారు. కాల భైరవ అందమైన ఆర్కెస్ట్రేషన్ తో అద్భుతమైన ట్యూన్ ను కంపోజ్ చేశారు. ఆస్కార్ విన్నర్ చంద్ర బోస్ హార్ట్ టచ్చింగ్ లిరిక్స్ అందించారు. ఈ పాట చెవిటి, మూగ అమ్మాయి, సౌండ్ నిరోధించే డివైజ్ ని ధరించి తన వినికిడి సామర్థ్యాన్ని త్యాగం చేయడానికి నిర్ణయించుకున్న అబ్బాయి చుట్టూ తిరుగుతుంది. ఎమోషనల్ అతను ఆమెకు ఒక లేఖ రాస్తాడు, ఆమెను ప్రేమిస్తానని ప్రామిస్ చేస్తాడు. ఐశ్వర్య దారురితో కలసి కాల భైరవ స్...

రామ్ చరణ్ ‘పెద్ది’ శ్రీలంకలో సాంగ్ షూటింగ్

Image
  రామ్ చరణ్ ‘పెద్ది’ శ్రీలంకలో సాంగ్ షూటింగ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హైలీ యాంటిసిపేటెడ్ రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ప్రతిష్టాత్మకంగా సమర్పిస్తున్నాయి. తాజాగా రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా, యూనిట్ సభ్యులు నెక్స్ట్ షెడ్యూల్ కోసం శ్రీలంకకు బయలుదేరారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే ఈ షెడ్యూల్‌లో అందమైన ప్రదేశాల్లో రామ్ చరణ్ – జాన్వీ కపూర్‌లపై ఒక అద్భుతమైన పాటను చిత్రీకరించనున్నారు.ఆస్కార్ అవార్డు విజేత ఏ.ఆర్. రహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. బుచ్చిబాబు సానా అత్యంత ప్రెస్టీజియస్ తెరకెకీస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్‌ను పూర్తిగా కొత్త లుక్‌లో, ఇప్పటివరకూ ఎన్నడూ చూడని గెటప్‌లతో ప్రజెంట్ చేస్తున్నారు. రామ్ చరణ్ ఈ పాత్ర కోసం కంప్లీట్ మేకోవర్స్ అవుతూ హై ఆక్టేన్ స్టంట్స్‌ చేయబోతున్నారు. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత...

బాలకృష్ణ అఖండ 2: తాండవం బ్లాస్టింగ్ రోర్ రిలీజ్

Image
  బాలకృష్ణ అఖండ 2: తాండవం బ్లాస్టింగ్ రోర్ రిలీజ్ గాడ్ ఆఫ్ ది మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ ఎక్స్‌ట్రావగాంజా ‘అఖండ 2: తాండవం’. ఇది వారి సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ అఖండకు సీక్వెల్. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ ద్వారా లెజెండ్ అఖండ పాత్రను పరిచయం చేసిన ఫస్ట్ టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు బాలకృష్ణ మరో పాత్రను పరిచయం చేయడానికి మేకర్స్ అఖండ 2: బ్లాస్టింగ్ రోర్ టైటిల్ తో మరో ఎలక్ట్రిఫైయింగ్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియోలో బాలకృష్ణ పూర్తి స్థాయి మాస్ అవతార్‌లో హై-వోల్టేజ్ యాక్షన్ తో అదరగొట్టారు. బోయపాటి శ్రీను తన సిగ్నేచర్ స్టైల్‌లో బాలయ్య ని లార్జర్ దెన్ లైఫ్ మూమెంట్స్ తో అద్భుతంగా ప్రజెంట్ చేశారు. బాలయ్య గర్జన సింహంలా వినిపించగా, ఆయన డైలాగ్ డెలివరీ, యాక్షన్ బ్లాక్స్ అదిరిపోయాయి. చివర్లో ఆయన కాలు మోపగానే గుర్రాలు భయంతో దూకడం పక్కా మాస్ ఎలివేషన్. ”సౌండ్ కంట్రోల్ ల...

“సంతాన ప్రాప్తిరస్తు” నవంబర్ 14న రిలీజ్

Image
  “సంతాన ప్రాప్తిరస్తు” నవంబర్ 14న రిలీజ్ కలర్ ఫొటో, గామి వంటి పలు హిట్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది యంగ్ టాలెంటెడ్ హీరోయిన్ చాందినీ చౌదరి. ఆమె హీరోయిన్ గా నటిస్తున్న కొత్త మూవీ “సంతాన ప్రాప్తిరస్తు”. యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కల్యాణి ఓరుగంటి అనే క్యారెక్టర్ లో చాందినీ ఆకట్టుకోనుంది. ఈరోజు చాందినీ చౌదరి పుట్టినరోజు సందర్భంగా బర్త్ డే విశెస్ చెబుతూ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. పెళ్లి కూతురిగా ముస్తాభైన చాందినీ స్టిల్ తో డిజైన్ చేసిన ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. విక్రాంత్ హీరోగా నటిస్తున్న “సంతాన ప్రాప్తిరస్తు” సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా నవంబర్ 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. నటీనటులు – విక్రాంత్, చాందినీ చౌదరి, వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, హర్షవర్థన్, ...

రెబెల్ స్టార్ ప్రభాస్ ‘ఫౌజీ’ పోస్టర్ రిలీజ్

Image
  రెబెల్ స్టార్ ప్రభాస్ ‘ఫౌజీ’ పోస్టర్ రిలీజ్ రెబెల్ స్టార్ ప్రభాస్, క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ #ప్రభాస్ హను కాన్సెప్ట్ పోస్టర్, ప్రీ-లుక్ తో భారీ అంచనాలను సృష్టించింది. మేకర్స్ ఈ రోజు టైటిల్ ని రివల్ చేశారు. సక్సెస్ ఫుల్ పాన్-ఇండియా బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో టి-సిరీస్ గుల్షన్ కుమార్ , భూషణ్ కుమార్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి ‘ఫౌజీ’ అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు. ఫౌజీ టైటిల్ ప్రభాస్ సైనికుడి పాత్రను సూచిస్తుంది. 1940 నేపథ్యంలో సాగే ఈ కథలో కాలిపోయిన బ్రిటిష్ జెండా తిరుగుబాటుకు సంకేతంగా కనిపిస్తోంది. చుట్టూ వ్యాపించిన అగ్నిజ్వాలలు, అందులో దాగి ఉన్న సంస్కృత శ్లోకాలు, కోడ్ లాంటి చిహ్నాలు ఈ కథలోని మిథాలజికల్, హిస్టారికల్ అంశాలను సూచిస్తున్నాయి. ముఖ్యంగా మహాభారతంలోని కర్ణుడి ప్రతిరూపంగా హీరోను చూపించే తీరు అద్భుతం. పోస్టర్‌లో ఉన్న శ్లోకాలు చెబుతున్న భావం గమనిస్తే.. అతను పద్మవ్యుహాన్ని ఛేదించిన అర్జునుడిలా, పాండవుల పక్షాన నిలిచే ధర్మయోధుడు. గురువులేని యోధుడు అయిన ఏకలవ్యుడిలా, సహజసిద్ధమైన శౌర్యం కలవాడు. బ్రాహ...

చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ షూటింగ్‌లో జాయిన్ అయిన విక్టరీ వెంకటేష్

Image
  చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ షూటింగ్‌లో జాయిన్ అయిన విక్టరీ వెంకటేష్ మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మన శంకర వర ప్రసాద్ గారు. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2026 సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందుకు రానుంది. కామెడీ, ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్‌ కలగలిపిన ఈ సినిమా పండగ సీజన్‌కు పర్ఫెక్ట్ ట్రీట్. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు. F2’, ‘F3’ లాంటి లాఫ్ రయాట్స్ ఇచ్చిన అనిల్ రావిపూడి, ‘మన శంకర వర ప్రసాద్ గారు’ మరోసారి విక్టరీ వెంకటేశ్‌తో జట్టుకట్టారు. ఐకానిక్ హీరోస్ చిరంజీవి – వెంకటేశ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం అభిమానులకు డబుల్ ఫెస్టివల్‌. ఈ సినిమాలో వెంకటేశ్ లెంగ్తీ, క్రూషియల్ పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని భారీ సెట్‌లో షూటింగ్ జరుగుతోంది. వెంకటేశ్ ఈరోజు షూట్‌కి జాయిన్‌ అయ్యారు. చిరంజీవి – వెంకటేశ్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మేకర్స్ విడుదల చేసిన వీడియోలో చిరంజీవి సంతోషంగా వెంకటేశ్‌ను వెల్‌కమ్ చెబుతుండ...

ఉన్నట్ట మరి లేనట్ట’ సాంగ్ రిలీజ్ చేసిన హీరో శ్రీకాంత్

Image
  ఉన్నట్ట మరి లేనట్ట’ సాంగ్ రిలీజ్ చేసిన హీరో శ్రీకాంత్ త్రినాధ్ కఠారి హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలో సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత బళ్లారి శంకర్ నిర్మిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ ఇట్లు మీ ఎదవ. తెలుగు అమ్మాయి సాహితీ అవాంచ హీరోయిన్ గా నటిస్తున్నారు. వెయేళ్ళు ధర్మంగా వర్ధిల్లు అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆర్పీ పట్నాయక్ ఈ సాంగ్ ని అద్భుతమైన మెలోడీగా కంపోజ్ చేశారు. పూర్ణాచారి ఆకట్టుకునే లిరిక్స్ రాశారు. S P చరణ్, శృతిక సముద్రాల వోకల్స్ మెస్మరైజ్ చేశాయి. సాంగ్ కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఇట్లు మీ ఎదవ టైటిల్ చాలా కొత్తగా వుంది. ఉన్నట్ట మరి లేనట్ట సాంగ్ చాలా అద్భుతంగా వుంది. ఆర్పీ పట్నాయక్ గారు ఎక్స్ట్రార్డినరీగా కంపోజ్ చేశారు. త్రినాధ్, సాహితీ జోడి చాలా బావుంది. ప్రొడ్యూసర్ శంకర్, డిఓపి జగదీష్ నాకు మంచి మిత్రులు. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తూ ఈ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను అని చెప్పారు. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, గోపరాజు రమణ, దేవీ ప్రసాద్, సురభి ప్రభావతి, మధుమణి, తాగుబోతు ...

సోషల్ మీడియాలో కోట్ల వ్యూస్‌తో దూసుకుపోతోన్న ‘త్రిముఖ’ టీజర్

Image
  సోషల్ మీడియాలో కోట్ల వ్యూస్‌తో దూసుకుపోతోన్న ‘త్రిముఖ’ టీజర్ సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో నటించిన ‘త్రిముఖ’ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్ మీద శ్రీదేవి మద్దాలి, రమేష్ మద్దాలి నిర్మాతగా సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో రానున్న చిత్రం ‘త్రిముఖ’. ఈ మూవీకి రాజేష్ నాయుడు దర్శకత్వం వహించారు. ఐదు భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించిన ఈ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రానున్న ఈ సినిమాని హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ మూవీ కాన్సెప్ట్ గురించి అందరికీ తెలిసేలా టీజర్‌ను అక్టోబర్ 18న రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘త్రిముఖ’ టీజర్ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. కేవలం ఇన్ స్టా హ్యాండిల్‌లోనే ఈ టీజర్ కోటి వ్యూస్‌ను దక్కించుకుంది. ఇలా కోట్ల వ్యూస్‌తో ‘త్రిముఖ’ టీజర్ నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. ఈ అద్భుతమైన స్పందనతో ‘త్రిముఖ’ మీదున్న బజ్ మరింతగా పెరిగింది. టీజర్‌ను చూస్తుంటే సినిమా స్టాండర్డ్స్, క్వాలిటీ, విజువల్స్, ఆర్ఆర్ ఇలా అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. త్రిముఖ మీద ప్రేక్షకుల...

తెలుసు కదా మీతో ఉండిపోతుంది: సిద్ధు జొన్నలగడ్డ

Image
  తెలుసు కదా మీతో ఉండిపోతుంది: సిద్ధు జొన్నలగడ్డ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ లేటెస్ట్ రాడికల్ బ్లాక్ బస్టర్ ‘తెలుసు కదా’. మిరాయ్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్స్. ప్రముఖ స్టైలిస్ట్-ఫిల్మ్ మేకర్ నీరజా కోన దర్శకత్వం వహించారు. అక్టోబర్ 17న గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో హౌస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ సందర్భంగా మేకర్స్ అప్రిషియేషన్ మీట్ నిర్వహించారు. అప్రిసియేషన్ మీట్ లో స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ..మీడియా వారికి థాంక్ యు. టిల్లు రిలీజ్ అయినప్పుడు ఎక్సైజ్మెంట్ ఫీల్ అయ్యాను. టిల్లు స్క్వేర్ రిలీజ్ అయిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ ఫీల్ అయ్యాను. జాక్ రిలీజ్ అయిన తర్వాత ఎమోషనల్ లాస్ ఫీల్ అయ్యాను. వీటన్నిటికంటే ఒక ఇంపార్టెంట్ ఫీలింగు తెలుసు కదా రిలీజ్ అయిన తర్వాత ఫీలయ్యాను. ఒక మనశ్శాంతిని ఫీలయ్యాను. ఈ సినిమా నన్ను ప్రశాంతంగా పడుకునేలా చేసింది. దీనికి అందరికంటే ముందుగా డైరెక్టర్ నీరజ కోన కి థాంక్స్ చెప్పాలి. నితిన్ అన్నకి థ...